కాంగ్రెస్, బీజేపీలొద్దు మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాలి: మమత
కాంగ్రెస్, బీజేపీలవల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని, అందుకే రానున్న ఎన్నికల్లోగా ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఫెడరల్ ఫ్రంట్ గా ఏర్పడాలని తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. కోల్ కతాలో మమతా బెనర్జీ మాట్లాడుతూ ప్రాంతీయపార్టీలు కేంద్రంలో కీలక పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందని, అప్పుడు దేశం మరింత ముందడుగు వేస్తుందని తెలిపారు. ప్రాంతీయపార్టీలు సమర్థవంతమైన వేదికను ఏర్పాటు చేసుకోవాలని, లేకుంటే వారిమాట వినే నాధుడుండడని దీదీ చెప్పారు. దుష్పరిపాలన, ప్రజావ్యతిరేక పాలనను అంతమొందించేందుకు ఇదే సరైన సమయమన్నారు.